మమతను కౌగిలించుకుంటానన్న బీజేపీ నేతకు కరోనా
ABN , First Publish Date - 2020-10-03T08:07:43+05:30 IST
తనకు కరోనా వస్తే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకొని ఆమెకూ వచ్చేలా చేస్తానని ప్రకటించిన ఆ రాష్ట్ర బీజేపీ నేత అనుమమ్ హజ్రాకు వైరస్ సోకింది...

తనకు కరోనా వస్తే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకొని ఆమెకూ వచ్చేలా చేస్తానని ప్రకటించిన ఆ రాష్ట్ర బీజేపీ నేత అనుమమ్ హజ్రాకు వైరస్ సోకింది. అస్వస్థతగా ఉండటంతో ఆయనకు కరోనా పరీక్ష చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా, వివాదాస్పద ప్రకటన చేసిన అనుపమ్‌పై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.