కరోనాపై సుప్రీంకోర్టు సమీక్ష

ABN , First Publish Date - 2020-03-18T07:41:38+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సీజే బోబ్డే, మరో ముగ్గురు జడ్జిలు మంగళవారం సమీక్షించారు.

కరోనాపై సుప్రీంకోర్టు సమీక్ష

న్యూఢిల్లీ, మార్చి 17: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సీజే బోబ్డే, మరో ముగ్గురు జడ్జిలు మంగళవారం సమీక్షించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఎవరికీ ఈ వైరస్‌ సోకకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కోర్టులో సిబ్బంది, కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. సీజే బోబ్డేతోపాటు జడ్జిలు అశోక్‌ భూషణ్‌, సంజయ్‌ కౌల్‌, ఎల్‌ నాగేశ్వరరావులు సుప్రీంకోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించి, కొందరు న్యాయవాదులతో మాట్లాడారు.

Updated Date - 2020-03-18T07:41:38+05:30 IST