ఆకలి తీర్చలేక.. ఐదుగురు పిల్లల్ని గంగలో తోసేసిన తల్లి

ABN , First Publish Date - 2020-04-13T08:36:09+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా సంపాదన కోల్పోయిన ఓ తల్లి.. బిడ్డల ఆకలి తీర్చే దారి లేక..

ఆకలి తీర్చలేక.. ఐదుగురు పిల్లల్ని గంగలో తోసేసిన తల్లి

జఘంగిరాబాద్‌ (యూపీ), ఏప్రిల్‌ 12: లాక్‌డౌన్‌ కారణంగా సంపాదన కోల్పోయిన ఓ తల్లి.. బిడ్డల ఆకలి తీర్చే దారి లేక తన ఐదుగురు పిల్లల్నీ గంగపాల్జేసింది. ఉత్తరప్రదేశ్‌లోని జఘంగిరాబాద్‌లో రోజువారి కూలీగా పనిచేసే ఓ మహిళ.. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయింది. తన ఐదుగురు పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వాళ్లకు తిండిపెట్టే దారిలేక గంగా నదిలో తోసేసింది. పోలీసులు పిల్లల కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-04-13T08:36:09+05:30 IST