కుటుంబ సభ్యుల మధ్య వేగంగా కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2020-06-19T08:47:11+05:30 IST

కుటుంబసభ్యుల్లో ఒకరి నుంచి మరొకరికి కొవిడ్‌ వైరస్‌ అతి వేగంగా సంక్రమిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(సార్స్‌), మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(మెర్స్‌) వైర్‌సల కన్నా వేగంగా...

కుటుంబ సభ్యుల మధ్య వేగంగా కరోనా వ్యాప్తి

న్యూయార్క్‌, జూన్‌ 18 : కుటుంబసభ్యుల్లో ఒకరి నుంచి మరొకరికి కొవిడ్‌ వైరస్‌ అతి వేగంగా సంక్రమిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(సార్స్‌), మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(మెర్స్‌) వైర్‌సల కన్నా వేగంగా.. కలిసి జీవించే వారు, వారి కుటుంబసభ్యుల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని వెల్లడైంది. ఈ అధ్యయనం లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. చైనాలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకిన 349 మంది, వారి సమీప బంధువులు 1,964 మంది వివరాలను విశ్లేషించారు. లక్షణాలు బయటపడకముందే వారికి వైరస్‌ సోకినట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది.


కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్న 60 ఏళ్లపైబడిన వారికి అతి సులువుగా కరోనా సంక్రమిస్తున్నట్టు స్పష్టమైంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కాంటాక్ట్‌గా తేలినవారి వల్ల వైరస్‌ వ్యాప్తి చెందడం లేదని పరిశోధకులు వివరించారు. వైరస్‌ సంక్రమించినా లక్షణాలు బయట పడనివారి వల్ల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాకు చెందిన యాంగ్‌యాంగ్‌ చెప్పారు. 


Updated Date - 2020-06-19T08:47:11+05:30 IST