కాసరగోడ్‌లో మళ్లీ కరోనా!

ABN , First Publish Date - 2020-05-13T07:39:32+05:30 IST

కేరళలో కొవిడ్‌-19 హాట్‌స్పాట్‌గా పేరొందిన కాసరగోడ్‌ జిల్లా గత ఆదివారం కరోనా ఫ్రీగా మారింది. ఒక్క కొత్త పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. అప్పటికే ఉన్న రోగులందరికీ కరోనా తగ్గిపోయి...

కాసరగోడ్‌లో మళ్లీ కరోనా!

న్యూఢిల్లీ, మే 12: కేరళలో కొవిడ్‌-19 హాట్‌స్పాట్‌గా పేరొందిన కాసరగోడ్‌ జిల్లా గత ఆదివారం కరోనా ఫ్రీగా మారింది. ఒక్క కొత్త పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. అప్పటికే ఉన్న రోగులందరికీ కరోనా తగ్గిపోయి, నెగటివ్‌ రిపోర్టు రావడంతో ఇంటికి పంపించేశారు. జిల్లాను కరోనా ఫ్రీగా ప్రకటించిన 24 గంటల్లో(సోమవారం) తిరిగి 4 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్‌ అని తేలింది. కేరళ ఉత్తరప్రాంతంలోని ఈ జిల్లాలో గత నెల ఏకంగా 164 కేసులు నమోదయ్యాయి.


రాష్ట్ర ప్రభుత్వం త్రీ లాక్‌ పద్ధతిని అమలు చేయడం ద్వారా నెల రోజుల వ్యవధిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఈ విజయానికి కారకుడైన ఐపీఎస్‌ అధికారి విజయ్‌ సఖారేను దేశమంతా ప్రశంసించింది. తిరిగి మళ్లీ కేసులు నమోదు కావడంతో అదే త్రీ-లాక్‌ పద్ధతిలో జిల్లాను కరోనా ఫ్రీగా మారుస్తామని విజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. త్రీ-లాక్‌ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం, మానవ పర్యవేక్షణ, ప్రజల కదలికలను నియంత్రించడం మూడూ ఉంటాయి. మరోవైపు.. విదేశాల నుంచి వస్తున్న కేరళ ప్రజలను నేరుగా ఇళ్ల కు వెళ్లకుండా 14 రోజులు హోటళ్లలో లేదా ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. వారి ఇళ్లపై నిరంతర పోలీసు నిఘా ఉంటుంది. అందరి ఫోన్లలో కొవిడ్‌ సేఫ్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 


Read more