పెరిగిన కరోనా కేసులు.. క్వారంటైన్‌‌లో ఒకరి మృతి!

ABN , First Publish Date - 2020-03-27T14:25:07+05:30 IST

కొవిడ్‌19 పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం నాటికి కరోనా బాధితుల సంఖ్య

పెరిగిన కరోనా కేసులు.. క్వారంటైన్‌‌లో ఒకరి మృతి!

చెన్నై : తమిళనాడులో కొవిడ్‌19 పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 27కి పెరిగింది. దుబాయ్‌ నుండి తిరుచ్చికి వచ్చిన 24 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యిందని, తిరుచ్చి జీహెచ్‌లో ఆ యువకుడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తున్నామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి.విజయభాస్కర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఐసోలేషన్‌ పడకలను కూడా పెంచుతున్నారు. చెన్నైలోని ఓమందురూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇదిలా వుండగా.. కన్నియకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో కరోనా క్వారంటైన్‌ వార్డులో చేరిన 40 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్టు తెలుస్తోంది. కువైట్‌ నుంచి ఈనెల 3వ తేదీన సొంతూరు అయిన కొడిమునైకి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో గత బుధవారం నాగర్‌కోయిల్‌ ప్రభుత్వాస్పత్రిలో కరోనా వార్డులో చేర్చారు. అనంతరం ఆయన రక్త నమూనాలు సేకరించి పరిశోధనకు పంపించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ వ్యక్తి మరణించారు. అయితే రిపోర్టులు వచ్చిన తరువాతే ఇది కరోనా మరణమా, కాదా అనేది తెలుస్తుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-27T14:25:07+05:30 IST