రష్యాలో 20వేలు దాటిన కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-04-15T03:34:57+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది.

రష్యాలో 20వేలు దాటిన కరోనా కేసులు!

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. ఇక్కడ మంగళవారం ఒక్కరోజే 2,774 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దేశరాజధాని మాస్కో నగరంలోనే 1400 కేసులున్నాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో రష్యాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,102కు చేరింది. ఈ విషయాన్ని రష్యాలోని కరోనా వైరస్ రెస్పాన్స్ కేంద్రాలు వెల్లడించాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడ కొత్తగా 22మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ దేశంలో కరోనా మరణాల సంఖ్య 170కి చేరింది. అలాగే మొత్తమ్మీద 1600 మంది వైరస్ బాధితులు కోలుకున్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.

Updated Date - 2020-04-15T03:34:57+05:30 IST