భారత్‌లో 11,439కి చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-15T15:26:23+05:30 IST

భారత్‌లో 11,439కి చేరిన కరోనా కేసులు

భారత్‌లో 11,439కి చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు. దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. కాగా కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 377 మంది మృత్యువాతపడ్డారు.


మరోవైపు కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ప్రధాన మోది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రజలనుద్దేశించి నిన్న ప్రసంగించిన మోదీ మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-04-15T15:26:23+05:30 IST