ఇప్పటి వరకూ ఇండియాలో ఎన్ని కరోనా పాజిటివ్ కేసులంటే..

ABN , First Publish Date - 2020-03-22T00:30:28+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న..

ఇప్పటి వరకూ ఇండియాలో ఎన్ని కరోనా పాజిటివ్ కేసులంటే..

ఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు కూడా రోజు రోజుకూ పెరగడంతో జనాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ వైరస్‌ను ఏ దేశమూ ఎదిరించలేకపోతోంది. మరోవైపు దీనికి మందు కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.


కాగా.. మన దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 298కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇదిలా ఉంటే.. 22 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కేరళలో 52.. మహారాష్ట్రలో 63 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ప్రపంచవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 11,400 మంది మరణించగా.. సాయంత్రానికి ఒక్కసారిగా ఈ మరణాల సంఖ్య 11,842కు చేరింది. అదే విధంగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్యలో కూడా గణనీయంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 84వేల 712 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 93,576మంది కోలుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-03-22T00:30:28+05:30 IST