6 గంట‌ల త‌ర్వాత అంబులెన్స్‌... 18 గంటల త‌ర్వాత బెడ్... ఇంత‌లో...

ABN , First Publish Date - 2020-05-24T16:54:59+05:30 IST

కరోనా వ్యాధి కార‌ణంగా రోగులు, వారి బంధువులు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నార‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఒక ఘ‌ట‌న నిలిచింది. క‌రోనా బాధితుడుని ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్స్‌కు...

6 గంట‌ల త‌ర్వాత అంబులెన్స్‌... 18 గంటల త‌ర్వాత బెడ్... ఇంత‌లో...

ముంబై: కరోనా వ్యాధి కార‌ణంగా రోగులు, వారి బంధువులు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నార‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఒక ఘ‌ట‌న నిలిచింది. క‌రోనా బాధితుడుని ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్స్‌కు ఫోను చేయ‌గా, అది 6 గంట‌ల త‌రువాత వ‌చ్చింది. త‌రువాత బాధితుడిని ఆసుప‌త్రికి తీసుకువెళ్లి, బెడ్ దొరికేస‌రికి 18 గంట‌లు ప‌ట్టింది. ఇలా బెడ్ ల‌భ్య‌మైన కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే క‌రోనా బాధితుడు మృతి చెందాడు. ఈ ఉదంతం ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి బాధితుని సోద‌రుడు  మాట్లాడుతూ మే 10 న తన సోదరుడికి జ్వరం వచ్చిందని, ఆ తర్వాత అతను సమీపంలోని వైద్యుడిని సంప్ర‌దించి, ఔషధంతో ఇంటికి వచ్చాడని వకోలాకు చెందిన వ్య‌క్తి తెలిపాడు. ఆ ఔషధంతో అతనికి ఎటువంటి ఉపశమనం ల‌భించ‌లేద‌న్నారు.  త‌రువాత త‌న సోద‌రుడు ఒంటి నొప్పులతోపాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిప‌డ్డాడు. వెంట‌నే అత‌నిని ఆసుపత్రికి తరలించాం. అక్కడ అత‌నికి న్యుమోనియా ఉన్న‌ట్లు తేలింది. ఈ నేప‌ధ్యంలోనే క‌రోనా టెస్టులు చేయించ‌గా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో సాయంత్రం 6 గంటలకు బీఎంసీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయ‌గా, 12.30 గంటలకు అంబులెన్స్ వ‌చ్చింది దీంతో బాధితుడిని గురునానక్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. అక్కడ వైద్యులు  మ‌రో ఆసుప‌త్రికి తీసుకు వెళ్లాల‌ని సూచించ‌గా అక్క‌డ‌కు వెళ్లాం. అక్క‌డ 18 గంట‌లు వేచివున్న త‌రువాత బెడ్ ల‌భ్య‌మ‌య్యింది.  చికిత్స పొందుతూ కొద్ది గంట‌ల్లోనే త‌న సోద‌రుడు మ‌ర‌ణించాడ‌ని ఆ వ్య‌క్తి తెలిపాడు. 

Updated Date - 2020-05-24T16:54:59+05:30 IST