క్వారంటైన్ నుంచి రోగి పరారీ, పట్టివేత
ABN , First Publish Date - 2020-04-07T08:07:46+05:30 IST
కరోనా వైరస్ క్వారంటైన్ నుంచి ఒక వ్యక్తి పరారైన ఘటన కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. అతడిని సిబ్బంది పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో...

జమ్ము, ఏప్రిల్ 6: కరోనా వైరస్ క్వారంటైన్ నుంచి ఒక వ్యక్తి పరారైన ఘటన కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. అతడిని సిబ్బంది పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో నివసించే షౌకత్ అహ్మద్ మాలిక్, ఆదివారం తను ఉంటున్న క్వారంటైన్ నుంచి పారిపోయాడు. కరోనా ఉందని తెలిసీ.. రోగి పారిపోయేందుకు యత్నించడంతో అతడిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.