గుజరాత్లో కలకలం.. బస్టాండ్‌లో కరోనా బాధితుడి మృతదేహం!
ABN , First Publish Date - 2020-05-17T23:50:40+05:30 IST
ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి మృతదేహం.. స్థానికంగా ఉన్న ఓ బస్టాప్‌లో దర్శనమిచ్చింది.

అహ్మదాబాద్: ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి మృతదేహం.. స్థానికంగా ఉన్న ఓ బస్టాప్‌లో దర్శనమిచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. ఓ 67ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఈ నెల 10న అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చేరాడు. రెండ్రోజుల తర్వాత అతనికి కరోనా సోకినట్లు తేలింది. ఆ వ్యక్తి మృతదేహం అహ్మదాబాద్ బస్టాండ్‌లో దర్శనమివ్వడంతో అందరూ షాకయ్యారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, అహ్మదాబాద్‌లో ఇప్పటికే కరోనా మహమ్మారి తీవ్రత భారీ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.