మీకు కరోనా తగులుగాక.. జడ్జితో లాయర్‌

ABN , First Publish Date - 2020-04-08T09:03:33+05:30 IST

బస్సు వేలం నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వనందుకు అసహనానికి గురైన న్యాయవాది ఏకంగా న్యాయమూర్తికి కరోనా తగలాలని శాపనార్ధాలు పెట్టారు.

మీకు కరోనా తగులుగాక.. జడ్జితో లాయర్‌

కోల్‌కతా, ఏప్రిల్‌ 7: బస్సు వేలం నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వనందుకు అసహనానికి గురైన న్యాయవాది ఏకంగా న్యాయమూర్తికి కరోనా తగలాలని శాపనార్ధాలు పెట్టారు. ఈ ఘటన కోల్‌కతా హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలో చోటు చేసుకుంది. వాయిదాలు చెల్లించని ఓ బస్సును బ్యాంకు వారు జనవరి 15న సీజ్‌ చేసి వేలానికి పెట్టారు. లాయర్‌ బిజోయ్‌ అధికారి స్టే కోరగా జడ్జి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా తిరస్కరించారు. దీంతో బిజోయ్‌ ఆగ్రహంతో మైక్రోఫోన్‌ను విసిరేసి జడ్జికి శాపనార్థాలు పెట్టారు. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

Updated Date - 2020-04-08T09:03:33+05:30 IST