చౌకంగా, వేగంగా కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-23T07:05:27+05:30 IST
కరోనా గుర్తింపు పరీక్షల ఫలితాలు రావడానికి ప్రస్తుతం రెండు రోజులు పడుతోంది. అతివేగంగా పరీక్షా ఫలితాలను ఇవ్వగలిగే టెస్టింగ్ పద్ధతుల అభివృద్ధికి ..

- అభివృద్ధి చేసిన ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్, మార్చి 22 : కరోనా గుర్తింపు పరీక్షల ఫలితాలు రావడానికి ప్రస్తుతం రెండు రోజులు పడుతోంది. అతివేగంగా పరీక్షా ఫలితాలను ఇవ్వగలిగే టెస్టింగ్ పద్ధతుల అభివృద్ధికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు కరోనాను గుర్తించే అతిచౌక పరీక్షా పద్ధతిని అభివృద్ధిచేశారు. దీని పరిధిలోని కుసుమ స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్సె్‌సకు చెందిన ప్రొఫెసర్ వివేకానందన్ పెరుమాళ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ఘనత సాధించింది. ఈ టెస్టు ద్వారా కరోనా వైరస్ చుట్టూ ఉండే కొంకి వంటి నిర్మాణాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్లను విశ్లేషించి వ్యాధి ఉందో లేదో తేలుస్తారు. ప్రస్తుతం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) ఈ కరోనా పరీక్ష ప్రామాణికత, ఫలితాల గుర్తింపులో కచ్చితత్వాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు అమెరికాలోని సెఫైడ్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కరోనాను 45 నిమిషాల్లో తేల్చేసే పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు.