కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన పెళ్లి!

ABN , First Publish Date - 2020-03-30T10:03:27+05:30 IST

పశ్చిమ బెంగాల్‌ ఓ పెళ్లి వేడుక కరోనా వ్యాప్తికి కేంద్రమైంది. ఈ నెల 15న మిడ్నాపూర్‌ జిల్లాలో జరిగిన వివాహానికి హాజరైన ఇద్దరు సీనియర్‌ సిటిజన్లు సహా ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో పెళ్లికి వచ్చిన 500 మందికిపైగా అతిథులను

కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన పెళ్లి!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఓ పెళ్లి వేడుక కరోనా వ్యాప్తికి కేంద్రమైంది. ఈ నెల 15న మిడ్నాపూర్‌ జిల్లాలో జరిగిన వివాహానికి హాజరైన ఇద్దరు సీనియర్‌ సిటిజన్లు సహా ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో పెళ్లికి వచ్చిన 500 మందికిపైగా అతిథులను హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. పెళ్లికి హాజరైన వారిలో వరుడి తండ్రి స్నేహితులు నలుగురు యూకే, సింగపూర్‌ నుంచి వచ్చారు. ఒడిసా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌కు చెందిన వారు కూడా పెళ్లికి హాజరయ్యారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-03-30T10:03:27+05:30 IST