ఇది ‘కరోనా’ కాదు.. ఖర్మ : గవర్నర్‌ కిరణ్‌ బేదీ

ABN , First Publish Date - 2020-03-21T13:33:17+05:30 IST

ఇది ‘కరోనా’ కాదు... ఖర్మ అని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ తాకిడికి 8 వేల మందికి పైగా మరణించారు. పుదుచ్చేరిలో జనసంచారం ఎక్కువగా ఉన్న

ఇది ‘కరోనా’ కాదు.. ఖర్మ : గవర్నర్‌ కిరణ్‌ బేదీ

చెన్నై: ఇది ‘కరోనా’ కాదు... ఖర్మ అని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ తాకిడికి 8 వేల మందికి పైగా మరణించారు. పుదుచ్చేరిలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మూసివేశారు. ప్రజలు కరోనా నుంచి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పుదుచ్చేరి గవర్నర్‌ కిరణ్‌ బేదీ ‘కరోనా’పై తన ట్విట్టర్‌లో... బోనులో ప్రజలు మాస్క్‌లు ధరించి ఉండగా, జంతువులు బయట స్వేచ్ఛగా ఉన్న ఫోటోతో పాటు దాని దిగువన ‘ఇది కరోనా కాదు..ఖర్మ’ అంటూ వ్యాఖ్యలను పోస్ట్‌ చేశారు.

Updated Date - 2020-03-21T13:33:17+05:30 IST