కరోనా చేపలు.. కేజీ 2వేలు..!

ABN , First Publish Date - 2020-03-16T16:15:24+05:30 IST

ప్రపంచమంతటా కరోనా వైరస్‌ గడగడలాడిస్తున్నా మంగళూరు ఓడరేవులో మాత్రం కరోనా చేపలకు భారీ డిమాండ్‌ పలుకుతోంది. అరుదైన జాతికి చెందిన ఈ చేపలు ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని శాస్త్రీయంగా ‘మెలనోటినియా

కరోనా చేపలు.. కేజీ 2వేలు..!

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రపంచమంతటా కరోనా వైరస్‌ గడగడలాడిస్తున్నా మంగళూరు ఓడరేవులో మాత్రం కరోనా చేపలకు భారీ డిమాండ్‌ పలుకుతోంది. అరుదైన జాతికి చెందిన ఈ చేపలు ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని శాస్త్రీయంగా ‘మెలనోటినియా కరోనా’గా పిలుస్తారు. సాధారణంగా ఈ చేపలు మత్స్యకారులకు లభిస్తే భారీగా డిమాండ్‌ ఉండేది. కానీ కరోనా అంటేనే గజగజ వణికే పరిస్థితి ఉండడంతో ఆ చేపల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. మంగళూరు, ఉడిపి ప్రాంతాలలో కొనుగోళ్ళు లేకపోయినా గుజరాత్‌ సహా వివిధ రాష్ట్రాలకు కరోనా చేపలను ఎగుమతి చేస్తున్నారు. కిలో రూ.1800-2,000దాకా ధర పలుకుతున్నట్టు మత్స్యకారులు తెలిపారు.

Updated Date - 2020-03-16T16:15:24+05:30 IST