కరోనా సోకిందనే భయంతో మెకానిక్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-07T13:13:25+05:30 IST
కోయంబత్తూర్‌లో కరోనా లక్షణాలున్నాయేమోన్న భయంతో మెకానిక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోవై ఆర్‌ఎస్ పురం సమీపం సీరనాయకన్‌పాళయంకు చెందిన మహేశ్వరన్ (49) మెకానిక్‌గా

చెన్నై : కోయంబత్తూర్‌లో కరోనా లక్షణాలున్నాయేమోన్న భయంతో మెకానిక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోవై ఆర్‌ఎస్ పురం సమీపం సీరనాయకన్‌పాళయంకు చెందిన మహేశ్వరన్ (49) మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతను అనారోగ్యంతో బాధపడుతుండడంతో నాలుగు రోజుల క్రితం అతని భార్య లత ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు కరోనా సోకిందని మహేశ్వరన్ భార్యతో చెబుతూ ఆందోళన చెందుతుండేవాడు. మంగళవారం రాత్రి యధావిధిగా నిద్రపోయిన లత ఉదయం లేచి చూడగా మహేశ్వరన్ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం గమనించి బోరుమంది. ఈ ఘటనపై ఆర్‌ఎం పురం పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.