కరోనా ఎఫెక్ట్.. ప్లేట్‌ బిర్యానీకి కొంటే ‘చికెన్‌ 65’ ఫ్రీ అట!

ABN , First Publish Date - 2020-03-13T12:49:18+05:30 IST

కరోనా, స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలడంతో ప్రజలను ఆకట్టుకొనేందుకు వ్యాపారులు ప్లేట్‌ బిర్యానీకి ‘చికెన్‌-65’ ఆఫర్‌ కల్పించారు. సాధారణంగా హోటళ్లలో బిర్యానీకి మంచి క్రేజ్‌ ఉంది. హోటళ్లలోనే కాకుం డా తోపుడు బండ్లలో కూడా చికెన్‌ బిర్యానీ విక్రయాలు

కరోనా ఎఫెక్ట్.. ప్లేట్‌ బిర్యానీకి కొంటే ‘చికెన్‌ 65’ ఫ్రీ అట!

చెన్నై: కరోనా, స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలడంతో ప్రజలను ఆకట్టుకొనేందుకు వ్యాపారులు ప్లేట్‌ బిర్యానీకి ‘చికెన్‌-65’ ఆఫర్‌ కల్పించారు. సాధారణంగా హోటళ్లలో బిర్యానీకి మంచి క్రేజ్‌ ఉంది. హోటళ్లలోనే కాకుం డా తోపుడు బండ్లలో కూడా చికెన్‌ బిర్యానీ విక్రయాలు అధికంగా ఉంటున్నాయి. ఇదిలా ఉండగా బాయిలర్‌ కోళ్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న ట్లు ప్రసార మాధ్యమాల్లో వదంతులు వ్యాపిస్తుండడంతో   చికెన్‌ విక్రయాలు పడిపో యి వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రముఖ హోటళ్ల నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటించాయి. ఒక ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ తీసుకున్న వారికి చికెన్‌-65 ఉచితంగా అందిస్తున్నటు బోర్డులను ఏర్పాటుచేశారు. ఇప్పటికే కోడి మాంసం కొనుగోళ్లు తగ్గడంతో కిలో మాంసానికి పది కోడిగుడ్లను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2020-03-13T12:49:18+05:30 IST