భారత్‌కు ఇజ్రాయిల్ నిపుణుల బృందం.. కరోనాపై పోరులో మరో ముందడుగు

ABN , First Publish Date - 2020-07-27T06:24:54+05:30 IST

న్యూఢిల్లీ: కరోనాపై సంయుక్త పరిశోధనలకు భారత్‌కు ఇజ్రాయిల్ నిపుణుల బృందం బయలుదేరింది. ఈ బృందం భారత్‌కు చేరుకున్నాక భారత వైద్యులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తారు.

భారత్‌కు ఇజ్రాయిల్ నిపుణుల బృందం.. కరోనాపై పోరులో మరో ముందడుగు

న్యూఢిల్లీ: కరోనాపై సంయుక్త పరిశోధనలకు భారత్‌కు ఇజ్రాయిల్ నిపుణుల బృందం ప్రత్యేక విమానంలో బయలుదేరింది. దీనికి సంబంధించి ఇజ్రాయిల్ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ బృందం భారత్‌కు చేరుకున్నాక భారత వైద్యులు, శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తారు. కరోనాకు సంబంధించి ఇప్పటికే సాధించిన ప్రగతి సమీక్షిస్తారు. కొత్త ప్రయోగాలు చేస్తారు. ఇజ్రాయిల్ నుంచి వస్తున్న ఈ బృందం వెంట అత్యంత అధునాతన టెస్టింగ్ మెకానికల్ వెంటిలేటర్లను, ఇతర యంత్రాలను తీసుకువస్తున్నారు. వీటి ద్వారా 30 సెకండ్లలో కరోనా ఉందా లేదా తెలుసుకోవచ్చు. కరోనానుంచి త్వరగా కోలుకునే మార్గాలను కూడా రెండు దేశాల నిపుణులు అన్వేషిస్తారు. 


కరోనాపై పోరు విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, ఇజ్రాయిల్ ఇప్పటికే నిర్ణయించాయి. కరోనా మహమ్మారి తలెత్తాక రెండు దేశాల ప్రధానులు ఇప్పటికే మూడుసార్లు ఆన్‌లైన్‌లో మాట్లాడుకున్నారు.  

Updated Date - 2020-07-27T06:24:54+05:30 IST