కొవిడ్‌ మృతుల క్లెయిమ్‌లను పరిష్కరించాల్సిందే

ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST

కొవిడ్‌ వైరస్‌తో మృతులకు సంబంధించిన క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సోమవారం ఆదేశించింది. పబ్లిక్‌, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు డెత్‌ క్లెయిమ్‌లకు సంబంధించిన...

కొవిడ్‌ మృతుల క్లెయిమ్‌లను పరిష్కరించాల్సిందే

  • లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ఆదేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: కొవిడ్‌ వైరస్‌తో మృతులకు సంబంధించిన క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సోమవారం ఆదేశించింది. పబ్లిక్‌, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు డెత్‌ క్లెయిమ్‌లకు సంబంధించిన దరఖాస్తులను ప్రాసెస్‌ చేసి తీరాలని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘పోర్స్‌ మెజర్‌’ అంటే ముందుగా ఊహించని లేదా నియంత్రించలేని పరిస్థితులు అన్న నిబంధన దీనికి వర్తిస్తుందని వివరించింది. అన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా ఇదే విషయాన్ని తమ కస్టమర్లకు తెలియజేయాలంది. ఈ విపత్కర సమయంలో పాలసీదారులకు అంతరాయం కలుగకుండా సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ ఎస్‌.ఎన్‌.భట్టాచార్య తెలిపారు. కస్టమర్ల వెన్నంటి ఉంటామని, వీలైనంత వేగంగా సంబంధిత కేసులను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. 


Read more