భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్
ABN , First Publish Date - 2020-03-23T15:51:18+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమై 10శాతం పడిపోయాయి. దీంతో ట్రేడింగ్‌ను తాత్కాలికంగా 45 నిమిషాల పాటు నిలిపివేశారు. అంతకుమందు సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 2,991 పాయింట్లు పతనమై 26,924 పాయింట్లకు...

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమై 10శాతం పడిపోయాయి. దీంతో ట్రేడింగ్‌ను తాత్కాలికంగా 45 నిమిషాల పాటు నిలిపివేశారు. అంతకుమందు సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 2,991 పాయింట్లు పతనమై 26,924 పాయింట్లకు, నిఫ్టీ 842 పాయింట్లు పతనమై 7,903కు చేరుకున్నాయి. సెన్సెక్స్ 10శాతం దిగజారడంతో ట్రేడింగ్‌ను నిలిపివేశారు. దీనికిముందు మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలోని 7 రాష్ట్రాలు లాక్‌డౌన్ కావడంతో మార్కెట్లు భారీ పతనం దిశగా కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా మరింతగా విజృంభించడం, నిన్న ఒక్కరోజే ముగ్గురు చనిపోవడంతో ఈ వ్యాధి మరింతగా వ్యాపిస్తుందనే భయాలు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితిలో పలువురు మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డారు. దీనికితోడు పలు కంపెనీలు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయడంతో ఆ ప్రభావం ఆదాయాలపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జపాన్ మార్కెట్ తోపాటు ఆసియాలోని అన్ని మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతుండటం గమనార్హం.