మగవారిపైనే కరోనా పంజా!

ABN , First Publish Date - 2020-12-30T08:21:45+05:30 IST

: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో మగవారిపైనే ఎక్కువగా విరుచుకుపడుతోంది. ఆ మహమ్మారి పంజాకు

మగవారిపైనే కరోనా పంజా!

మరణాల్లో 70% మంది వారే

గణాంకాలను వెల్లడించిన కేంద్రం


న్యూఢిల్లీ, డిసెంబరు 29: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో మగవారిపైనే ఎక్కువగా విరుచుకుపడుతోంది. ఆ మహమ్మారి పంజాకు ఇప్పటి వరకు 1.48 లక్షల మంది బలవ్వగా.. మొత్తం మరణాల్లో మగవారి వాటా 70శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం మరణాల్లో 60 ఏళ్లలోపు వారు 45 శాతంగా ఉన్నట్లు ఆయన వివరించారు. మొత్తం కరోనా కేసుల్లో కూడా మగవారే అధికంగా (63ు) ఉన్నారని రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. వాటిల్లో 18-44 ఏళ్ల మధ్య వయస్కులు 52ు ఉన్నారని, అయితే ఈ వయోవిభాగంలో మరణాలు తక్కువగా (11ు) నమోదయ్యాయన్నారు.

Updated Date - 2020-12-30T08:21:45+05:30 IST