25,00,000.. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇది

ABN , First Publish Date - 2020-08-16T07:38:56+05:30 IST

దేశంలో మళ్లీ 60వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 65,002 మందికి వైరస్‌ సోకిందని, 996మంది మృతి చెందారని కేంద్రం ప్రకటించింది. దీంతో 7 రోజుల్లోనే 4.40 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు...

25,00,000.. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇది

  • 24 గంటల్లో 8.68 లక్షల పరీక్షల నిర్వహణ
  • ఒక్క రోజులో అత్యధికంగా 57,381 మంది రికవరీ


న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో మళ్లీ 60వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 65,002 మందికి వైరస్‌ సోకిందని, 996మంది మృతి చెందారని కేంద్రం ప్రకటించింది. దీంతో 7 రోజుల్లోనే 4.40 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. దేశంలో కరోనా బాధితులు 25లక్షలు, మృతుల 49 వేలు దాటింది. మరోవైపు 24గంటల్లో అత్యధికంగా 57,381 మంది కోలుకున్నారని, 8.68 లక్షల పరీక్షలు చేసినట్లు కేంద్రం వివరించింది. రికవరీలు, యాక్టివ్‌ కేసుల మధ్య అంతరం 11 లక్షలు దాటిందని పేర్కొంది. 6.68 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. మొత్తం బాధితుల్లో వీరు 26.45 శాతమేనని తెలిపింది.కరోనా టీకా అందుబాటులోకి వస్తే తొలుత కొవిడ్‌ వారియర్స్‌కే ఇస్తామని మంత్రి అశ్వినికుమార్‌ చౌబే తెలిపారు.


మిజోరం మినహా అన్ని రాష్ట్రాల్లో వెయ్యిపైగా..

ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కొత్తగా 148 కేసులు రావడంతో సిక్కింలో బాధితుల సంఖ్య 1,080కి చేరింది. దీంతో మిజోరం మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో వెయ్యిపైనే కేసులు నమోదయ్యాయి. మిజోరంలో 657కేసులున్నాయి. మణిపూర్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. కర్ణాటకలో రికార్డు స్థాయిలో 8,818 కేసులు నమోదయ్యాయి. 114 మంది మృతి చెందారు. తమిళనాడులో మరో 5,860 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.


127 మంది చనిపోయారు. మహారాష్ట్రలో మళ్లీ 12 వేల పైగా కేసులు రికార్దయ్యాయి. మంత్రి బాలాసాహెబ్‌ పాటిల్‌కు పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో వైరస్‌ పల్లెలకూ పాకడం ఆందోళన కలిగి స్తోంది. ఢిల్లీలో అంతా బాగుందని తేలినప్పుడే పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. బిహార్‌లో 3,536 తాజా కేసులతో బాధితులు లక్షను మించారు. లక్ష కేసులు దాటిన 8వ రాష్ట్రం బిహార్‌. ఒడిశాలో భారీగా 2,500మంది వైరస్‌కు గురయ్యారు. దేశంలో రోజూ 10 లక్షల పరీక్షల నిర్వహణ దిశగా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నెల 12న 8.68 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 2.85 కోట్ల మందికి పైగా పరీక్షలు జరిగాయి. 12 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉందని, 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు 50పైనేనని కేంద్రం ప్రకటించింది. రికవరీ రేటులో రాజధాని ఢిల్లీ(89.87) అగ్రస్థానంలో ఉంది.



దక్షిణ కొరియాలో చేతులెత్తేశారు!

దక్షిణ కొరియాలో కరోనా కేసులు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. దీంతో కొవిడ్‌ నియంత్రణ సాధ్యం కాదంటూ అధికారు లు చేతులెత్తేశారు. సియోల్‌ ప్రాంతంలో వైరస్‌ మరింత తీవ్రంగా ఉందని, అక్కడి 5.1 కోట్ల మంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డేగ్యు నగరం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. దేశంలో 15,039 కేసులు నమోదు కాగా, 305 మంది వైర్‌సతో ప్రాణాలు కోల్పోయినట్టు దక్షిణ కొరియా ప్రకటించింది. యూరప్‌ దేశాల్లోనూ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. క్లబ్బులు, పార్కులు మూసేశారు. పర్యాటక ప్రాంతాలపై నిషేధం విధించారు. కొన్ని దేశాల్లో ప్రయాణాలపైనా నిషేధం విధించారు. బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లలో 1.4 లక్షల మంది వైర్‌సతో చనిపో యారు. స్పెయిన్‌లో 14 రోజుల్లో 50 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 3 లక్షల మందిని అరెస్టు చేశారు. 


Updated Date - 2020-08-16T07:38:56+05:30 IST