దేశవ్యాప్తంగా 30వేలకు చేరువలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-28T21:56:52+05:30 IST

దేశంలో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా 30వేలకు చేరువలో కరోనా కేసులు

హైదరాబాద్: దేశంలో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో 15 వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య వెయ్యికి చేరువైంది. ఇప్పటి వరకు 939 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 29వేల 451కి చేరింది.

Updated Date - 2020-04-28T21:56:52+05:30 IST