తమిళనాడులో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

ABN , First Publish Date - 2020-06-17T02:25:05+05:30 IST

తమిళనాడులో కరోనా కరోనా కొంత తగ్గుముఖం పట్టింది. రెండు రోజుల క్రితం వరకు కరోనా కేసులు 2000లకు పైగా నమోదైన...

తమిళనాడులో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

చెన్నై: తమిళనాడులో కరోనా కరోనా కొంత తగ్గుముఖం పట్టింది. రెండు రోజుల క్రితం వరకు కరోనా కేసులు 2000లకు పైగా నమోదైన విషయం తెలిసిందే. అయితే సోమవారం 1800పైగా నమోదైన కేసులు నేడు మరింత తగ్గి 1500 మాత్రమే నమోదయ్యాయి. దీంతో కరోనా ప్రభావం కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. తాజా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,515 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,438మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 48,019కి చేరింది. వీరిలో 20,709 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 26,782 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 528 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-17T02:25:05+05:30 IST