భారతదేశ వ్యాప్తంగా 74,281కి చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-13T22:02:59+05:30 IST

భారత్‌పై కరోనా దండయాత్ర కొనసాగుతూనే ఉంది.

భారతదేశ వ్యాప్తంగా 74,281కి చేరిన కరోనా కేసులు

భారత్‌పై కరోనా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలో కేసులు రేసు గుర్రాళ్లా పరిగెడుతున్నాయ్. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,525 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,281కి చేరింది. గత 24 గంటల్లో 122 మంది చనిపోగా.. ఇప్పటి వరకు 2,415 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలి వెళుతుండడంతో రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతోంది.

Read more