కరోనా కేసులను దాచొద్దు: రాజీవ్ గౌబ
ABN , First Publish Date - 2020-04-26T17:59:46+05:30 IST
అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ రాజీబ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు. కరోనా వైరస్ కేసులను

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ రాజీబ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు. కరోనా వైరస్ కేసులను దాచవద్దని స్పష్టం చేశారు. కరోనా కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అధికంగా టెస్టులు చేయడంతో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని రాజీవ్ గౌబ పేర్కొన్నారు. హాట్‌స్పాట్, కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎస్‌లను రాజీవ్‌గౌబ ఆదేశించారు.