తమిళనాడులో 1600కు చేరువైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-22T04:06:12+05:30 IST

దేశంలో కరోనా వల్ల తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను...

తమిళనాడులో 1600కు చేరువైన కరోనా కేసులు

చెన్నై: దేశంలో కరోనా వల్ల తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ప్రతి రోజూ నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కూడా 76 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుల్లో కూడా 55 రాజధాని చెన్నైలోనే  నమోదయ్యాయి. దీంతో చెన్నైలో మొత్తం 358 కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తగా బయటపడిన కేసులతో కలిసి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,596కు చేరగా.. 18 మంది మరణించారు.

Updated Date - 2020-04-22T04:06:12+05:30 IST