తమిళనాడులో కరోనా సంక్షోభం.. 75వేలకు చేరువైన కేసులు..

ABN , First Publish Date - 2020-06-27T01:40:48+05:30 IST

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం...

తమిళనాడులో కరోనా సంక్షోభం.. 75వేలకు చేరువైన కేసులు..

చెన్నై: తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో నేడు 3,600కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75వేలకు చేరువైంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 3,645 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 46 మంది మరణించారు. 1,358మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 74,622కి చేరింది. వీరిలో 32,305మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 41,357మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 957మంది ప్రాణాలు కోల్పోయారు.
Updated Date - 2020-06-27T01:40:48+05:30 IST