తమిళనాడులో 2వేలు దాటిన కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-04-29T03:17:10+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఈ మహమ్మారి మరీ ఎక్కువగా విజృంభిస్తోంది.

తమిళనాడులో 2వేలు దాటిన కరోనా కేసులు!

చెన్నై: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఈ మహమ్మారి మరీ ఎక్కువగా విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో తాజాగా 121 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,058కి చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ 2,058మందిలో 1,128 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు తమిళనాడులో లక్షపైగా కరోనా పరీక్షలు జరిగినట్లు, 30వేలమందికిపైగా హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-04-29T03:17:10+05:30 IST