తమిళనాడులో కొత్తగా 798 కరోనా కేసులు.. 8000 దాటిన బాధితులు

ABN , First Publish Date - 2020-05-12T01:09:15+05:30 IST

తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతోంది. వందల సంఖ్యలో నమోదవుతున్న...

తమిళనాడులో కొత్తగా 798 కరోనా కేసులు.. 8000 దాటిన బాధితులు

చెన్నై: తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతోంది. వందల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా నమోదైన కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 798 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మరణించారు. కరోనా నుంచి కోలుకున్న 92 మంది బాధితులను డిశ్చార్జ్ చేశారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 8002కు చేరాయి. 53 మంది మరణించారు. 2,051 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 5,895 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.




Updated Date - 2020-05-12T01:09:15+05:30 IST