రష్యాలో 80వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-27T00:57:23+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి రష్యాలో విజృంభిస్తోంది.

రష్యాలో 80వేలు దాటిన కరోనా కేసులు

మాస్కో: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి రష్యాలో విజృంభిస్తోంది. ఇక్కడ కొత్తగా 6,361 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ గడిచిన 24 గంటల్లోనే రికార్డయ్యాయి. దీంతో ఈ దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 80,949కి చేరింది. అలాగే కొత్తగా 66మంది కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో ఇక్కడి కరోనా మరణాల సంఖ్య 747కు చేరింది. ఈ విషయాన్ని రష్యాలోని కరోనా క్రైసిస్ రెస్పాన్స్ బృందాలు ఆదివారం వెల్లడించాయి. ఇక్కడ కరోనా కేసులు ఏప్రిల్ నెలలోనే మొదలయ్యాయి.

Updated Date - 2020-04-27T00:57:23+05:30 IST