పాక్‌లో 40వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-18T04:16:44+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దాయాది దేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

పాక్‌లో 40వేలు దాటిన కరోనా కేసులు

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దాయాది దేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పాకిస్తాన్‌లో గడిచిన 24 గంటల్లో 1,352 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,151కి చేరింది. ఈ విషయాన్ని పాక్ ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే కొత్తగా 39 కరోనా మరణాలు సంభవించాయని, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 873కు చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 3.73 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-05-18T04:16:44+05:30 IST