పాక్‌లో 72వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-02T04:35:10+05:30 IST
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా భూతం.. మన దాయాది దేశం పాకిస్తాన్‌లో విలయతాండవం చేస్తోంది.
ఇస్లామాబాద్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా భూతం.. మన దాయాది దేశం పాకిస్తాన్‌లో విలయతాండవం చేస్తోంది. ఇక్కడ సోమవారం ఒక్కరోజే కొత్తగా 2,964 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,460కి చేరింది. ఈ విషయాన్ని పాక్ ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అలాగే ఇక్కడ కొత్తగా 60మంది ఈ వైరస్‌కు బలయ్యారని, దీంతో పాక్‌లో కరోనా మరణాల సంఖ్య 1,543కు చేరిందని అధికారులు తెలిపారు. పాక్‌లో ఇప్పటి వరకు 26, 083 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది.