ముంబైలో 12వేలకు చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-09T22:31:37+05:30 IST
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమమ్మారి.. మన దేశంలో కూడా విజృంభిస్తోంది.
ముంబై: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమమ్మారి.. మన దేశంలో కూడా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. వాణిజ్య రాజధాని ముంబై నగరంలో విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలో కొత్తగా 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,967కు చేరింది. ఈ వివరాలను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది. అదేవిధంగా కరోనా కారణంగా ఈ నగరంలో సంభవించిన మరణాల సంఖ్య 462కు చేరినట్లు అధికారులు చెప్పారు.