భారత దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా వ్యాప్తి తీవ్రత

ABN , First Publish Date - 2020-10-13T18:24:15+05:30 IST

భారత దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న...

భారత దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా వ్యాప్తి తీవ్రత

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం  8,38,729కి చేరింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 11.69 శాతానికి తగ్గాయి. గత 24 గంటల్లో 77,760 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడు నెలల్లో మొత్తం యాక్టివ్ కేసులు కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,342 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. 706 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 71,75,881కి చేరింది. 1,09,856 మంది మరణించారు. చికిత్స నుంచి కోలుకుని ఇప్పటి వరకు 62,27,296 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.53 శాతంగా ఉంది. రికవరీ రేటు 86.78 శాతానికి పెరిగింది.

Updated Date - 2020-10-13T18:24:15+05:30 IST