ప్రపంచవ్యాప్తంగా కోటి 23 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-10T17:10:05+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బాధితుల సంఖ్య..

ప్రపంచవ్యాప్తంగా కోటి 23 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బాధితుల సంఖ్య కోటి 23 లక్షలు దాటింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,23,89,559 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,57,405 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 71,87,447 మంది కోలుకున్నారు. 


ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 32,19,999 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,35,822 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 14,26,428 మంది కోలుకున్నారు. మరిన్ని వివరాలకు పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-07-10T17:10:05+05:30 IST