ప్రపంచవ్యాప్తంగా 91 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-23T15:47:53+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 91 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య 91 లక్షలు దాటిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. బ్రెజిల్‌లో పరిస్థితి దారుణంగా మారింది.


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 91,88,362 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,74,339 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 49,37,282 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో  ఇప్పటి వరకు 23,88,153 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,22,610 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,02,929 మంది కోలుకున్నారు. మరిన్ని వివరాలకొసం పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-06-23T15:47:53+05:30 IST