ప్రపంచవ్యాప్తంగా 47లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-17T15:49:32+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 47లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 47 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు 18 లక్షల మందికిపైగా కరోనా వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. అమెరికాలో ఉద్రితి అలాగే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 47,20,196 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,13,220 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 18,11,674 మంది కోలుకున్నారు. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 15,07,773 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 90,113 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 3,39,232 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,76,505 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,563 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,92,253 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 2,72,043 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 2,537 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 63,166 మంది కోలుకున్నారు. 


ఇటలీలో గత 24 గంటల్లో మొత్తం 2,24,760 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 31,763 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,22,810 మంది కోలుకున్నారు. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,40,161 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 34,466 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 990 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-05-17T15:49:32+05:30 IST