ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-28T17:00:37+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య ఇప్పటి వరకు 10 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం 2,380 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం 30,64,894 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 160 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 2,11,609 మంది మృ‌తిచెందారు. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇవాళ 151 కొత్త పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10,10,507 ఉండగా, ఇవాళ ఆరుగురు చనిపోయారు. అలాగే ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 56,803 మంది మృతిచెందారు. ఇందులో ఎక్కువగా న్యూజెర్సీ, న్యూయార్క్ నగరంలోనే చనిపోయారు. కాగా అమెరికాలో కేసులు, మరణాల సంఖ్య తగ్గిందని ట్రంప్ చెబుతున్నారు. ఇక స్పెయిన్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. స్పెయిన్‌లో మొత్తం 2,29,422 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 23,521 మంది చనిపోయారు.

Updated Date - 2020-04-28T17:00:37+05:30 IST