ప్రైవేటు బస్సు, టాక్సీ రంగాలపై కరోనా దెబ్బ
ABN , First Publish Date - 2020-06-22T06:32:38+05:30 IST
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రైవేటు రంగంలోని బస్సులు, టూరిస్ట్ టాక్సీ ఆపరేటర్లపై తీవ్ర ప్రభావం పడింది. సర్వీసులు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది ఉపాధి గల్లంతయినట్టు భారత...

- ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బీఓసీఐ
న్యూఢిల్లీ, జూన్ 21: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రైవేటు రంగంలోని బస్సులు, టూరిస్ట్ టాక్సీ ఆపరేటర్లపై తీవ్ర ప్రభావం పడింది. సర్వీసులు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది ఉపాధి గల్లంతయినట్టు భారత బస్సు, కార్ ఆపరేటర్ల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీఓసీఐ 20,000 మంది ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ ఆపరేటర్లు 15 లక్షల బస్సులు, మాక్సీ క్యాబులు, 11 లక్షల టూరిస్ట్ టాక్సీలను నడుపుతున్నారు.
కోటి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని చెబుతున్నారు. కరోనా మూలంగా ఈ రంగాలపై తీవ్ర ప్రభావం పడినందున పన్నులు, రుణాలపై వడ్డీని ఎత్తివేయాలని బీఓసీఐ కోరుతోంది. కాగా, ఇంధన ధరలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతోపాటు రాష్ర్టాల సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద అధికారుల అవినీతితో దేశంలోని 65 శాతం ట్రక్కులు కదలడం లేదని ట్రక్ ఆపరేటర్ల సంఘం అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.