చనిపోయిన కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2020-05-26T03:39:45+05:30 IST

శ్వాసకోశ సమస్యలు, కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఓ కానిస్టేబుల్ మృతి చెందడంతో పోలీసులు చెలరేగిపోయారు

చనిపోయిన కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేసిన పోలీసులు

కోల్‌కతా: శ్వాసకోశ సమస్యలు, కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఓ కానిస్టేబుల్ మృతి చెందడంతో పోలీసులు చెలరేగిపోయారు. తమ సహచరుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. కోల్‌కతాలో జరిగిందీ ఘటన. 40 ఏళ్ల కానిస్టేబుల్ శ్వాసకో స సమస్యలతోపాటు కోవిడ్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. అతడి మృతితో మనస్తాపానికి గురైన సహచర పోలీసులు గర్ఫా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఉంటే బతికి ఉండేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి ధ్వంసం చేశారు. కాగా, కానిస్టేబుల్ స్వాబ్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలినట్టు కోల్‌కతా పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు గర్ఫా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు ఆందోళన విరమించారు. కాగా, కోల్‌కతాలో ఇప్పటి వరకు ఏడుగురు పోలీసులు కరోనా బారినపడ్డారు.  

Updated Date - 2020-05-26T03:39:45+05:30 IST