ఆరోగ్య సేతు యాప్ తయారీపై దుమారం, స్పష్టతనిచ్చిన కేంద్రం
ABN , First Publish Date - 2020-10-29T02:45:52+05:30 IST
ఆరోగ్య సేతు యాప్‌కు సంబంధించిన వివరాల కోసం ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్‌ఐసీని కోరాడు. అయితే దాని గురించి తమ వద్ద సమాచారం లేదని ఎన్‌ఐసీ పేర్కొంది. ఇది కాస్త పెద్ద దుమారానికి కారణమైంది

న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్ తయారీపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. ఈ యాప్ తయారీ గురించి ఓ వ్యక్తి ఆర్‌టీఐ ద్వారా సమాచారం కోరగా, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వద్ద ఎలాంటి సమాచారం లేదని సమాధానం వచ్చింది. దీంతో దుమారం ప్రారంభమైంది. ఇది గుర్తించిన కేంద్రం వెంటనే వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వమే రూపొందించిందని అయితే దానికి ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుందని స్పష్టం చేసింది. సమాచారం లేదని వివరణ ఇచ్చిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు నోటీసులు పంపింది.
ఆరోగ్య సేతు యాప్‌కు సంబంధించిన వివరాల కోసం ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్‌ఐసీని కోరాడు. అయితే దాని గురించి తమ వద్ద సమాచారం లేదని ఎన్‌ఐసీ పేర్కొంది. ఇది కాస్త పెద్ద దుమారానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వెబ్‌సైట్లు, యాప్‌లను ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్‌ఐసీ అభివృద్ధి చేస్తుంది.