కాంటాక్ట్‌లెన్స్ కంటే కళ్లజోడే బెటర్
ABN , First Publish Date - 2020-04-12T05:51:49+05:30 IST
కాంటాక్ట్‌లెన్స్ ఉపయోగిస్తున్న వారు కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకూ కళ్లజోడులకు మారాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కళ్లలోకి వైరస్ ప్రవేశించకుండా కళ్లజోడులు...

బెంగళూరు, ఏప్రిల్ 11: కాంటాక్ట్‌లెన్స్ ఉపయోగిస్తున్న వారు కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకూ కళ్లజోడులకు మారాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కళ్లలోకి వైరస్ ప్రవేశించకుండా కళ్లజోడులు అడ్డుకుంటాయని బెంగళూరుకు చెందిన ప్రముఖ నేతృవైద్య నిపుణులు డాక్టర్ కె.భుజంగ్ శెట్టి తెలిపారు. కరోనా వ్యాపించకుండా ఉండటానికి చాలా మంది మాస్కును ధరిస్తున్నారు కానీ, నోరు, ముక్కు ద్వారానే కాకుండా కళ్లద్వారా కూడా వ్యక్తి శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తుందని నారాయణ నేత్రాలయ చైర్మన్ అన్నారు. సాధారణంగా మానవులు గంటలో సుమారు 20 సార్లు తెలిసో, తెలియకో ముఖాన్ని, కళ్లను ముట్టుకుంటుంటారు. కళ్లజోడు పెట్టుకున్న వారికంటే కాంటాక్ట్ లెన్స్‌లు ఉన్నవారికి ఈ కరోనా సమయంలో రిస్క్ ఎక్కువ. వారి చేతివేళ్లు నేరుగా కళ్లను తాకే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీరికి వైరస్ సోకే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నోరు, ముక్కు ద్వారా వైరస్ ప్రవేశించకుండా ఎలాగైతే మాస్క్ రక్షణగా ఉంటుందో, అదేవిధంగా కళ్లకు కళ్లజోడు రక్షణ కల్పిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.