కేంబ్రిడ్జితో కుమ్మక్కయ్యారు: రాహుల్‌కు రవిశంకర్ కౌంటర్

ABN , First Publish Date - 2020-08-16T23:42:03+05:30 IST

సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ అధీనంలో పెట్టుకున్నాయంటూ..

కేంబ్రిడ్జితో కుమ్మక్కయ్యారు: రాహుల్‌కు రవిశంకర్ కౌంటర్

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ అధీనంలో పెట్టుకున్నాయంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొట్టిపారేశారు. ఎన్నికలకు ముందు కేంబ్రిడ్జి అనల్టికా, ఫేస్‌బుక్‌‌తో కాంగ్రెస్ కుమ్మక్కై డాటాను ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు అదే పని తాము చేశామంటూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.


'పరాజితులు ప్రజావిశ్వాసం చూరగొనలేరు. ఎన్నికలకు ముందు డాటా కోసం కేంబ్రిడ్జి అనల్టికా, ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారు ఇప్పుడు మామీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు' అంటూ  రాహుల్‌ను పరోక్షంగా విమర్శించారు. నిజానికి సమాచార వ్యవస్థ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతోందని, గాంధీ ఫ్యామిలీ గుప్పిట్లో ఇవి కొనసాగకపోవడంతో అది వారికి మనస్తాపంగా ఉందని పేర్కొన్నారు. బెంగళూరు అల్లర్లను మీరు ఎందుకు ఖండించలేదు? మీ ధైర్యం ఏమైంది? అని రాహుల్‌ను రవిశంకర్ ఎదురు ప్రశ్నించారు.

Updated Date - 2020-08-16T23:42:03+05:30 IST