వర్చువల్‌గా పాల్గొనే చాన్స్ ఇవ్వాలి: కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-08-20T07:54:41+05:30 IST
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేరుగా పాల్గొనలేని ఎంపీలకు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడులను కాంగ్రెస్ పార్టీ కోరింది. కోర్టుల్లో చేస్తున్నట్లు ఎంపీలకు యాప్ లేదా లింక్ ద్వారా పార్లమెంటు...

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేరుగా పాల్గొనలేని ఎంపీలకు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడులను కాంగ్రెస్ పార్టీ కోరింది. కోర్టుల్లో చేస్తున్నట్లు ఎంపీలకు యాప్ లేదా లింక్ ద్వారా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ బిర్లాకు అధీర్ రంజన్ చౌదరి, వెంకయ్యకు చిదంబరం బుధవారం లేఖ రాశారు.