వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం: కాంగ్రెస్ సెటైర్లు

ABN , First Publish Date - 2020-12-05T21:44:37+05:30 IST

వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం: కాంగ్రెస్ సెటైర్లు

వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం: కాంగ్రెస్ సెటైర్లు

న్యూఢిల్లీ: రైతుల నుంచి తీవ్ర నిరసన రావడంతో వ్యవసాయ చట్టాల్లో సరవణలు చేసేందుకు కేంద్ర అంగీకరించింది. మొదట ఈ చట్టాల విషయంలో పట్టుబట్టి ఉన్న కేంద్రం.. రైతుల నిరవదిక నిరసనతో దిగిరాక తప్పలేదు. అయితే ఈ విషయమై కేంద్ర ప్రబుత్వంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు గుప్పించింది. రైతు వ్యతిరేక బిల్లులకు తాము మద్దతిస్తే.. రైతుల ఆసక్తిని మరలుస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేసిందని, కానీ రైతు డిమాండ్లకు తలొంచక తప్పలేదని లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఎద్దేవా చేశారు.


‘‘రైతు వ్యతిరేక బిల్లులను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పుడు, రైతుల ఆలోచనల్ని ఆసక్తిని మరలుస్తున్నారని అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఆరోపించారు. మరి వారి ప్రభుత్వమే వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేసేందుకు అంగీకరించారు. అయిష్టంగానే అయినా రైతుల నిరసనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. తప్పదు కూడా’’ అని అధిర్ రంజన్ అన్నారు.

Updated Date - 2020-12-05T21:44:37+05:30 IST