పశ్చిమబెంగాల్ యూనిట్‌ను ప్రక్షాళన చేసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-10-12T23:56:54+05:30 IST

వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర యూనిట్‌ను..

పశ్చిమబెంగాల్ యూనిట్‌ను ప్రక్షాళన చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది (2021) జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర యూనిట్‌ను కాంగ్రెస్ పార్టీ పునర్వవస్థీకరించింది. వివిధ కమిటీలు, ఆఫీసు బేరర్లు, ఎన్నికల కమిటీలకు చైర్మన్లు/కన్వీనర్ల నియామకం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


'కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ కమిటీలు (సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్), ఆఫీసు బేరర్లు (ఉపాధ్యక్షలు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, మైనారిటీ సెల్), క్షమశిక్షణా కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీల చైర్మన్లు, కన్వీనర్ల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారు. తక్షణం ఈ నియామకాలు అమలులోకి వస్తాయి' అని కాంగ్రెస్ ప్రకటన పేర్కొంది.


కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా ప్రదీప్ భట్టాచార్య, కన్వీనర్‌గా బాదల్ భట్టాచార్య, సహ కన్వీనర్‌గా దివ్యేందు మిత్రాలను నియమించారు. ప్రచార కమిటీకి మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ సారథ్యం వహిస్తారు. తులసి ముఖర్జీ కో-కన్వీనర్‌గా ఉంటారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా అబ్దుల్ మన్నన్‌ను, కన్వీనర్‍‌గా అమితబ్ చక్రవర్తిని నియమించారు.

Updated Date - 2020-10-12T23:56:54+05:30 IST