వచ్చే ఏడాది రాజస్థాన్‌లో కాంగ్రెస్ జాతీయ సదస్సు
ABN , First Publish Date - 2020-12-29T09:34:32+05:30 IST
కాంగ్రెస్ పార్టీ జాతీయ సదస్సు వచ్చే ఏడాది రాజస్థాన్‌లో జరగనుంది. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో సదస్సు ఉండవచ్చని
రాహుల్‌ను మళ్లీ అధ్యక్షుడిగా ప్రతిపాదించనున్న పార్టీ!
న్యూఢిల్లీ, డిసెంబరు 28: కాంగ్రెస్ పార్టీ జాతీయ సదస్సు వచ్చే ఏడాది రాజస్థాన్‌లో జరగనుంది. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో సదస్సు ఉండవచ్చని ఆ వర్గాలు చెప్పాయి. సదస్సు ఏర్పాట్లపై పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతం రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగి స్వదేశానికి వచ్చాక సదస్సు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఆ వర్గాలు తెలిపాయి. అలాగే రాహుల్‌ను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని ఈ సదస్సులో పార్టీ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. కాగా విహారయాత్ర కోసమే రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లారని విమర్శించిన బీజేపీకి కాంగ్రెస్ సమాధానం ఇ చ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బంధువును చూడ్డానికే ఆయన అక్కడికి వెళ్లారని ఆ పార్టీ నాయకుడు రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు.